calender_icon.png 10 January, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందు తాగితే టికెట్ ఇవ్వం

03-10-2024 12:14:15 AM

  1. శ్రేణులకు మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్‌ఆర్ హెచ్చరిక

దండేపల్లిలో మద్యపాన నిషేధంపై ప్రతిజ్ఞ

మంచిర్యాల, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మందు తాగిన నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదిలేదని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు హెచ్చరిం చారు. బుధవారం గాంధీ జయంతిని పురష్కరించుకొని మంచిర్యాలలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన విలేకరుల సమావే శంలో మాట్లాడారు. మద్యం సేవించబోమని ప్రమాణం చేయాలని సూచించారు. మాట తప్పిన కాంగ్రెస్ నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్టు ఇవ్వబోమని స్పష్టం చేశారు. అందరూ చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండాలన్నారు. నేతలందిపైనా ప్రత్యేక దృష్టి ఉంటుందని స్పష్టం చేశారు.

అనంతరం దండేపల్లి మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్‌తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. దండేపల్లి మండ లం నుంచి స్వచ్ఛంద మద్యపాన నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలి పారు.

ఈ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలువాలన్నారు. సంవత్సరం పాటు మద్యపానం చేయకుండా స్ఫూర్తినివ్వాలని కోరా రు. ఈ సందర్భంగా ప్రజలతో మద్యం సేవించబోమని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీము బారక్ చెక్కులను అందజేశారు.