calender_icon.png 17 April, 2025 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీకల్లు తాగి అనారోగ్య పాలు కావద్దు: ఎమ్మెల్యే పోచారం

08-04-2025 05:12:50 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కల్తీకల్లు తాగి అస్వస్థతకి గురై బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్  కిరణ్మయి, ఆసుపత్రి సూపరిండెంట్ విజయలక్ష్మి, ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల, బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎక్సైజ్, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...

నసురుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో నిన్న కల్తీకల్లు తాగి అస్వస్థతకి గురయ్యారు. వారిని ఎక్సైజ్, రెవెన్యూ, పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో బాన్సువాడలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీమతి విజయలక్ష్మి, సిబ్బంది వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందించారు. అస్వస్థతకు గురైన దాదాపు 60 మందికి ఎవరికి ప్రాణాపాయం లేదు, కొంత మంది క్షతగాత్రులను వైద్య అవసర నిమిత్తం నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ఆసుపత్రులకు తరలించారు. ఎటువంటి ఒత్తిడులకు లోనవ్వకుండా కల్తీకల్లు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశించారు.