calender_icon.png 8 April, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలకు మోసపోవద్దు..

07-04-2025 08:05:22 PM

ఎస్ఐ మహమ్మద్ గౌస్...

కొల్చారం (విజయక్రాంతి): సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై మహమ్మద్ గౌస్ ప్రజలకు అవగాహన కల్పించారు. సోమవారం నాడు మండల పరిధిలోని పైతర గ్రామంలో గ్రామస్తులతో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఎవరైనా కొత్త నెంబర్ల నుండి ఫోన్ చేసి బ్యాంకు ఖాతా నెంబర్ కానీ ఓటీపీ నెంబర్ కానీ అడిగినట్లయితే ఎవరు కూడా తెలుపవద్దని సూచించారు. ఏ బ్యాంకు వారు కూడా ఫోన్లు చేసి బ్యాంకు ఖాతా నెంబర్లు అడగరని ప్రజలు గమనించవలసి ఉంటుందని అన్నారు.

గుర్తుతెలియని నంబర్ల నుండి ఫోన్ కాల్స్ వస్తే వన్ డబల్ జీరోకు కానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే యువకులు మత్తుకు బానిసలు కావద్దని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనాలు అతివేగంగా నడపడం వలన రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. ఎందరో యువకులు చిన్నవయసులో రోడ్డు ప్రమాదాల వలన మృతి చెందడంతో వారి భార్య పిల్లలు అనాధలైపోతున్నారని వెల్లడించారు. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.