calender_icon.png 26 November, 2024 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం తాగి వాహనాలు నడపొద్దు

11-10-2024 02:06:28 AM

రోజుకు 20 మంది ప్రమాదాల్లో చనిపోతున్నరు 

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): మద్యం తాగి వాహనాలు నడుపొద్దని, ఇది ప్రమాదానికి సూచిక అని వాహనదారులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్, సీటు బెల్టు ధిరించాలని గురువారం ఆయన ఒక వీడియోలో సందేశం పంపారు.

దసరా పండుగ నాడు చెడుపై మంచి విజయం సాధించాలని, దానికి గుర్తుగా కుటుంబ సభ్యులందరం కలిసి ఈ దసరాకి ఆయుధ పూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దామని  పొన్నం పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఏటా రోడ్డు ప్రమాదాల్లో 1 లక్షా 60 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, తెలంగాణలో రోజుకు 20 మంది వరకు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని తెలిపారు. విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని, కుటుంబ సభ్యులకు దు:ఖం కలిగించొద్దని మంత్రి సూచించారు.