బూర్గంపాడు ఎస్సై రాజేష్...
మణుగూరు (విజయక్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా, మద్యం సేవించి వాహనాలు నడిపిస్తూ పట్టుబడితే కఠినంగా చర్యలు తప్పవని బూర్గంపాడు ఎస్సై రాజేష్ వాహనదారులను హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం శుక్రవారం మండలంలోని సారపాక పల్లె ప్రకృతి వనం వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు ఉండేలా చూసుకోవాలని, ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దని, పరిమితికి మించిన వేగంతో వెళ్లవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.