అశ్వాపురం ఎస్సై ఎస్.కె రవూఫ్
మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం ఎస్సై ఎస్.కె రవూఫ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులతో ఎస్ఐ మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు వాహనం యొక్క ధ్రువీకరణ పత్రాలు, లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మద్యం తాగి వాహనం నడిపి అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని అన్నారు. మద్యం మత్తులో ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులకు శిక్షలు తప్పవని తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.