calender_icon.png 9 March, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ స్కూల్స్ పక్షాన స్కూల్స్ ని ఎలాంటి కేటగిరీలో విభజించవద్దు..

05-03-2025 08:19:45 PM

ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎన్ రెడ్డి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): ప్రైవేట్ స్కూల్స్ పక్షాన స్కూల్స్ ని ఎలాంటి కేటగిరీలలో విభజించవద్దని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే. అనిల్ కుమార్, కోశాధికారి కే. శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రైవేట్ స్కూల్స్ ఫీజులపై డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో డైరెక్టర్ E.V నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ పిలుపు మేరకు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎన్ రెడ్డి, కార్యదర్శి కే. అనిల్ కుమార్, కోశాధికారి K.శ్రీకాంత్ రెడ్డి హాజరైనట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రైవేట్  స్కూల్స్ పక్షాన స్కూల్స్ ని ఎలాంటి కేటగిరీలలో విభజించొద్దు, ఫీజులు స్కూల్ యొక్క ఖర్చులకి సరిపడేలాగా అనుసంధానంగా ఉండాలని అన్నారు. ప్రతి ఏడాది 15% ఫీజు పెంచుకోవడానికి అర్హత కల్పించాలని, అంతకన్నా ఎక్కువ పర్సంటేజ్ పెంచుకునే అవసరం అయితే అప్పుడు ఫీ రెగ్యులారిటీ కమిటీని సంప్రదించాలని అన్నారు. లేనియెడల 15% పెంచుకోవడానికి స్వేచ్ఛ ఉండాలని అప్పుడుగాని స్కూల్స్ యాజమాన్యాలు సంతృప్తికరంగా వారి యొక్క సమస్యలను న్యాయ పూర్వకంగా పిల్లలకు న్యాయం చేస్తూ పేరెంట్స్ కి అధిక భారం పడకుండా మంచి విద్యా ప్రమాణాలతో స్కూల్స్ నిర్వహించడానికి సాధ్యమవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వారు వెల్లడించారు.