calender_icon.png 7 November, 2024 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణికులకు ఆటంకాలు కలిగించొద్దు

31-08-2024 02:14:12 PM

వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులను తీసుకోవాల్సిందే

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

జగిత్యాల,(విజయక్రాంతి): ప్రయాణికుల రాకపోకలకు ఆటంకాలు కలిగించకుండా వినాయక మండపాలు ఏర్పాటుకు అనుమతులను తీసుకోవాలి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శనివారం  విలేఖరులతో ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖ రూపొందించిన గణేష్ మండపాల నిర్వహణకు ఆన్లైన్ దరఖాస్తు సమాచారం  కోసం రూపొందించిందని అన్నారు. దీంతో భద్రత, బందోబస్తు ఏర్పాటుకు పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు. ఆన్ లైన్ సమాచారం కోసం రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వాహకులు  విగ్రహాలను వివిధ కూడళ్లలో  ఏర్పాటు చేయుటకు ముందస్తు సమాచారం పోలీసుస్టేషన్ లో సమాచారం ఇవ్వాలని,అందుకోసం ఏదైనా కంప్యూటర్, మొబైల్ లలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

గణేష్ మండపాలను ట్రాఫిక్ ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించ కుండా ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. మండపాలను ఏర్పాటు చేసే స్థలాల కోసం శాఖల వారితో అనుమతులు తీసుకోవాల న్నారు. విద్యుత్ శాఖ అధికారుల అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాల ని, షార్ట్ సర్క్యూట్ జరుగకుండా నాణ్యత గల వైర్ ఉపయోగించాల న్నారు. మండపాల నిర్వాహకులు కమిటీ,బాధ్యత వహించే వివరాలు, ఫోన్ నెంబర్లను  ఏర్పాటు చేయాల న్నారు. వృద్ధులు, విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా ఉండే  శబ్దకాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10గంటల వరకు మాత్రమే స్పీకర్ల ను వినియోగించాలని, మండపాల్లో ఎట్టిపరిస్థితులో ఏర్పాటుచేయరాదన్నారు. గణేష్ ప్రతిమలు కూర్చోబెట్టే ప్రదేశాల్లో షెడ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు. గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాల న్నారు. గణేష్ దర్శనం వచ్చే భక్తుల సందర్శనను దృష్టిలో వుంచుకొని మండపాలలో క్యూలైన్ల ఏర్పాటు, వాలంటీర్ల నియమించాలన్నారు. 

గణేష్ మండపాల వద్ద ఎప్పుడైన అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు ఏర్పాటు చేసుకోవాలని గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం,పేకాట ఆడటం, అసభ్య కరమైన నృత్యాలు, అన్యమతస్తు లను కించపరిచేలా ప్రసంగాలు చేయడం, పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం విధించినట్లు ఎస్పీ తెలిపారు. విధిగా పాయింట్ పుస్తకాలు ఏర్పాటు చేసుకోవాలని, పోలీసులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారని వివరించారు. మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100, లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించా లన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతు లను నమ్మకూడదని, ఎవ్వరికైనా సందేహాలుంటే  సంబంధిత పోలీస్, డయల్ 100 కు సమాచారం అందించాలన్నారు. గణేష్ పండుగ  శాంతి యుతంగా నిర్వహించుకోవా లని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.