calender_icon.png 2 January, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్జీల పరిష్కారంలో జాప్యం చేయవద్దు

30-12-2024 10:53:45 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారంలో జాప్యం చేయవద్దని జిల్లా అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్లు అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. మొత్తం 30 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రత్నా కళ్యాణి అధికారులు పాల్గొన్నారు.