calender_icon.png 27 November, 2024 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల ఇళ్లకు నష్టం కలిగించొద్దు

09-10-2024 01:55:30 AM

మూసీ ప్రక్షాళన కోసం వేలాది ఇళ్లను తొలగించాలనుకోవడం సమంజసం కాదు 

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (విజయక్రాంతి): పేదల ఇళ్లకు నష్టం కలగకుం డా మూసీ ప్రక్షాళన చేపట్టాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మం గళవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమా వేశం నిర్వహించారు.

సీపీఎం నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను తొలగించాలనుకోవడం సమంజసం కాదన్నారు. టూరిజం అభివృద్ధి, కార్పొరేట్ కంపె నీల వ్యాపారాల కోసం పేదల ఇళ్లను తొలగించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.

బఫర్‌జోన్‌ను ముట్టుకోబోమని డిప్యూటీ సీఎం చెబుతుంటే.. 50 మీటర్ల వరకు బఫర్‌జోన్‌గా గుర్తించి భూసేకరణ చట్టం ప్రకా రం ముందుకు సాగుతామనే మున్సిపల్‌శా ఖ సెక్రటరీ ప్రకటనలతో ప్రజలను గందరగోళానికి గురవుతున్నారని పేర్కొన్నారు.

సీపీఎం, సీపీఐ(ఎంఎల్)ఎన్డీ, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, ఎంసీపీఐయూ నాయకులు ఎం మహేంద ర్, ఝాన్సీ, పద్మ, అను రాధ, అనిల్‌కుమార్, ఐద్వా, పీవోడబ్ల్యూ సంఘాల నాయకులు ఎం వరలక్ష్మి, సంధ్య, స్వరూప, అరుణ, మానవహక్కుల నాయకుడు సయ్యద్ బిలాల్ పాల్గొన్నారు.