calender_icon.png 21 April, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చారిత్రక కట్టడాలకు నష్టం కలగొద్దు

18-04-2025 01:05:02 AM

  1. పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై హైకోర్టు ఆదేశం
  2. తదుపరి విచారణ ఈనెల 22కు వాయిదా

హైదరాబాద్, ఏప్రిల్ 17: పాతబస్తీలో మెట్రో నిర్మాణం వల్ల పురాతన కట్టడాలకు నష్టం కలగకుండా చూసుకోవాలని హైకోర్టు సూచించింది. పాతబస్తీలో మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై గురువారం ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదనలు వినిపించారు. పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం లేకుండా చూస్తున్నామని, చారిత్రక కట్టడాలను కూల్చడం లేదని కోర్టుకు తెలిపారు. పరిహారం చెల్లించాకే స్థలాలు సేకరించి నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు.

దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ పురావస్తుశాఖ గుర్తించిన చారిత్రక కట్టడాల వద్ద ఎలాంటి పను లు చేపట్టవద్దని ఆదేశించింది. ఈనెల 22 లోగా కౌంటర్ దాఖ లు చేయాలన్న హై కోర్టు తదుపరి విచారణను 22కు వాయి దా వేసింది.