వారు నకిలీ వైద్యులు.. ఐఎంఏ తెలంగాణ
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ఆర్‌ఎంపీలు, పీఎంపీల కు ప్రభుత్వం సహకరించొద్దని, వారు నకిలీ వైద్యులని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ శాఖ, హెల్త్ కేర్ రీఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ సోమవారం వేర్వేరు ప్రకటనల్లో విజ్ఞ ప్తి చేశాయి. ఆర్‌ఎంపీ, పీఎంపీలకు స్వల్పకాలిక శిక్షణ ఇచ్చి వారితో రోగులకు ప్రథమ చికిత్స అందించాలని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారని ఈ వైద్య సంఘాలు తెలిపాయి. తాము ఇందుకు పూర్తిగా వ్యతిరేకమని.. ఎలాంటి వైద్య శిక్షణ లేని ఈ నకిలీ వైద్యులను నిషేధించాలని కోరా రు. వీరు డాక్టర్ అనే పదాన్ని వాడకుండా ప్రభుత్వం ఆదేశించాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాళీప్రసాద్‌రావు కోరారు.