జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్, జనవరి 6 (విజయ క్రాంతి): మధ్యవర్తులను ఎట్టి పరిస్థితుల్లో సంప్రదించకూడదని జిల్లా ఎస్పీ డి జానకి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రం లోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి జానకి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్టీ మాట్లా డుతూ ప్రజలకు మంచి చేయాలని పోలీసు లు రాత్రి పగలు శ్రమిస్తున్నారని తెలిపారు.
సమస్యలు ఉంటే చట్ట ప్రకారం పరిష్కరించు కోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని, స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్లను సంప్రదించి న్యాయం పొందాలని సూచించారు. ఎవరో తెలిసిన వ్యక్తి ద్వారానే పోలీస్ స్టేషన్ కు రావలసిన అవసరం లేదని, పోలీసులు న్యా యం వైపు నిలబడతారని తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడ మే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా నుంచి వివిధ ఫిర్యాదుదారులు 15 మంది ఎస్పీకి తమ సమస్యలను తెలియజే శారు. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.