calender_icon.png 1 November, 2024 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనుల నాణ్యతలో రాజీపడొద్దు

01-07-2024 12:08:44 AM

  • అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి సూచన
  • మధిరలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

ఖమ్మం, జూన్ 30 (విజయక్రాంతి): పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడవద్దని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం గాంధీనగర్‌లో రూ.175 లక్షల అంచనాతో  బొప్పారం నుంచి గాంధీనగర్ వరకు బీటి రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం భట్టి విక్రమార్క శంకస్థాపన చేశారు. మధిర మండ లం వంగవీడు వద్ద రూ.30కోట్లతో బోనకల్లు  ఆళ్లపాడు  వంగవీడు బీటీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ రోడ్డు నిర్మాణంతో బోనకల్ వంగ వీడు గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుందని భటి అన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడవద్దని అధికారులకు సూచనలు చేశారు. అనంతరం స్థానిక ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. చిలుకూరు గ్రామంలోని శివాలయం వద్ద బీటీ రోడ్డు నిర్మాణానికి, చిలుకూరుదొడ్డదేవరపాడు బీటీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వేగంగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

భట్టి సంకల్పంతో మధిరకు మహర్దశ

పైలెట్ ప్రాజెక్టుగా మధిరలో రూ.22 కోట్ల వ్యయ అంచనాలతో 25 ఎకరాల్లో అన్ని వర్గాలకు చెందిన గురుకులాలు ఒకే చోట ఉండేలా ప్రయత్నం చేస్తున్నారు. సమీకృత గురుకులాల్లోనే ఆట స్థలం, గ్రీనరీ, ఓపెన్ ఎయిర్ థియేటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆదివారం సంబంధిత అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష జరిపారు. మినీ గురుకుల విశ్వవిద్యాలయ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  కాగా రాష్ట్ర వ్యవసాయ, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి ఖమ్మంలో ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించారు. అనంతరం మధిరలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశా రు. మహిళలకే త్వరలో గ్రామాల్లో ఏర్పాటు చేసే మీ సేవా కేంద్రాల నిర్వహణ ను అప్ప గిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

బీటీపీఎస్‌లో పిడుగుపాటుపై సమీక్ష

బీటీపీఎస్‌లో శనివారం పిడుగుపడి కోట్ల మేర నష్టం జరిగిన నేపథ్యంలో ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిరలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అధికారుల నుంచి పలు అంశాలపై వివరణ తీసుకున్నారు.