బాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది శార్వరీ వాఘ్. ఈ ఏడాది లో ఈ బ్యూటీ నటించిన చిత్రాలు ఇప్పటికే మూడు విడుదలయ్యాయి. ఆగస్టు 15న జాన్ అబ్రహ్మం సరసన ‘వేద’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా కోసం బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం ‘ఆల్ఫా’లో అలియా భట్‌తో క లిసి నటిస్తోందీ అమ్మడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శార్వరీ.. తన గు రించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. “విభిన్నమైన పాత్రలు పోషిస్తూ, కొత్త నైపుణ్యాలతో అభిమానులను అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. వి క్రాంత్ మాస్సే ‘12th ఫెయిల్’లో హీరో పాత్రలో నేనుంటే ఎలా ఉండేదని ఎన్నో సార్లు ఊహించుకుంటున్నా.
నాకు ఆ పాత్ర చేయాలనిపించింది. ఆ రోల్ బాగా నచ్చింది” అని చెప్పిందీ సొగసరి. తన అలవాట్లూ, అభిరుచుల గురించి చెప్తూ.. ‘పని ఒత్తిడి తగ్గించుకునేందుకు కొన్ని అభిరుచుల్ని ఏర్పర్చుకున్నా. ముఖ్యంగా స్నేహితులతో కలిసి మట్టితో కళాకృతులు చేస్తా. ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువ సమయం వ్యాయామానికే కేటాయిస్తా.. అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కష్టపడక తప్పదు కదా మరి! ఇంకొకరితో పోల్చుకోవడం నాకు ఇష్టం ఉండదు. నన్ను ఇంకొకరికి ఉదాహరణగా చూపించేలా ఎదగాలనుకుంటున్నా. ఎవరి గుర్తింపు వారిదే. అలియా భట్‌ను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఎదిగేందుకు కృషి చేస్తున్నా” అని తెలిపింది.