calender_icon.png 11 October, 2024 | 12:52 PM

పేదల ఇండ్ల జోలికి రావొద్దు!

04-09-2024 12:16:35 AM

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ 

ఎల్బీనగర్, సెప్టెంబర్ 3: ‘అధికారులారా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చండి.. కానీ, అన్ని అనుమతులు తీసుకుని పేదలు కట్టుకున్న ఇండ్ల జోలికి వస్తే ఊరుకోబోమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఎల్బీనగర్‌లోని నియోజకవర్గం సరూర్‌నగర్ చెరువును  మంగళవారం ఆయన పరిశీలించారు. ముందుగా చంపాపేట డివిజన్‌లో కుమ్మరిబస్తీలో రూ.56 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్, మారుతినగర్ కాలనీలోని కమ్యూనిటీ హాల్‌ను కార్పొరేటర్ వంగ మధుసూదన్‌రెడ్డితో కలిసి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు.

చంపాపేటలో అభివృద్ధి పనులకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. మారుతీనగర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని స్థానికులు ఎంపీకివినతిపత్రం అందజేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, అనిల్‌కుమార్, శ్రీశైలం, శేఖర్, ఆర్.శ్రీనివాస్, సుమిత్‌సింగ్, కల్యాణ్, శ్రీనివాస్, శ్రీధర్‌గౌడ్ పాల్గొన్నారు.