జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రపాలి
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1(విజయక్రాంతి) : భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దు అని జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రపాలి సూచించారు. సోమవారం అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఈ క్రమంలో నగరంలోని లేక్‌వ్యూ గెస్ట్ హౌజ్ వద్ద నిర్మిస్తున్న సంపు పనులను ఆదివారం కమిషనర్ పరిశీలించారు. 141 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద స్టాటిక్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు నీటిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
హైడ్రా, జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇప్పటివరకు ప్రాణ నష్టమేమీ జరగలేదని, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలను ఒంటరిగా బయటకు పంపొద్దన్నారు. హుస్సేన్‌సాగర్ సహా 22లేక్స్ నిండడానికి వచ్చాయని వాటి గేట్లను తెరిచామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు.