calender_icon.png 25 October, 2024 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు

02-09-2024 12:43:45 AM

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కేంద్ర మంత్రి, టీ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాణ నష్టం సంభవించకుం డా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అత్యంత అప్రమత్తం గా ఉండాలన్నారు. నాలాలు, డ్రైనేజీ పొంగుపొర్లుతున్నందున చిన్నారులను, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజప్తి చేస్తున్నామన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.

అనేక చోట్ల విద్యుత్  తీగలు తెగిపడి కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందన్నారు. నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లి ఇండ్లళ్లోకి నీళ్లు వస్తున్నాయన్నారు. కొన్ని చోట్ల చెరువులు తెగిపోయిన నేపథ్యం లో ప్రాణ నష్టం సంభవించకుండా ఉండేలా యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులంతా జాగ్రత్త గా ఉంటూ అధికారులకు సహకరిస్తూ సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.