calender_icon.png 26 October, 2024 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్ల నుంచి బయటికి రావద్దు

26-10-2024 03:20:17 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: మరికొన్ని రోజుల్లో దేశంలో దీపావళిన పటాకులు కాల్చే అవకాశం ఉండడం, చలికాలం ప్రవేశిస్తుండడంతో వాయు కాలుష్యం తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీతో పాటు ఇతర నగరాల్లో వాయు కాలుష్యం పెరగడానికి  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలి పింది. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడంతో వచ్చే పొగ, శీతాకాల పు పొగమంచు కమ్మేయడంతో  కాలుష్యం పెరిగే అవకాశం ఉండడంతో ఆయా రాష్ట్రా లు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.

గాలి కాలుష్యం పెరుగుతుండ డంతో మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లడం, ఆటలు ఆడడం వంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలని సూచించింది. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. పండుగ సందర్భంగా పటాకులు కాల్చడం, వాహనాల వాడకాన్ని తగ్గించాని సూచించింది.