calender_icon.png 12 April, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం తెలియని లింక్‌లను క్లిక్ చేయొద్దు

28-03-2025 12:00:00 AM

వినియోగదారులకు టీజీఎస్‌పీడీసీఎల్ హెచ్చరిక

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27(విజయక్రాంతి) : విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం తెలియని లింక్‌లను క్లిక్ చేయొద్దని వినియోగదారులకు టీజీఎస్‌పీడీసీఎల్  సీఎండీ ముషారఫ్ ఫరూఖీ హెచ్చరించారు. వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను ఎవరితోనూ పొంచుకోవద్దని గురువారం సూచించారు. విద్యుత్ వినియోగదారులకు సైబర్ నేరగాళ్లు నకిలీ మెసేజ్ లు పంపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ‘గత నెల బిల్లు చెల్లించ నందున రాత్రి 7.30గంటల తర్వాత విద్యుత్ సరఫరా నిలిపిస్తాం’ అని ఆ సందేశంలో ఉననట్లు తెలిపారు. అది నమ్మి పలువురు సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు తెలిపారు. బిల్లులు చెల్లించడంలో సమస్యలు ఉంటే వెంటనే వాట్సప్‌లో సంప్రదించాలని సూచించారు. లేదంటే నేరుగా తమ www.tgsouthernpower.org వెబ్‌సైట్, టీజీఎస్‌పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా తెలుసుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త పడాలని పేర్కొన్నారు.