- టీజీపీఎస్సీపై నిరుద్యోగుల గుర్రు
- ఈ ఏడాది జాబ్ క్యాలెండర్ యథావిధిగా అమలు చేయాలి
- మార్పులు చేయాలనుకుంటే 2026లో చేయాలని డిమాండ్
హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): “గ్రూప్ నాలుగు పేప ర్లు, గ్రూప్ మూడు పేపర్లున్నాయి. అన్ని పేపర్లు అవసరం లేదు... పేపర్లు ఆస్థాయిలో ఉండాలా? లేదా? అనేది, సిలబస్‌పై కూడా అధ్యయనం చేస్తాం..”అన్న టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వ్యాఖ్యలపై నిరుద్యోగులు మండిపడ్తున్నారు. గ్రూప్స్ సిల బస్ మార్చొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ సిలబస్ మార్చే ఆలోచన ఉంటే 2026 నోటిఫికేషన్లకు అమలు చేయాలని సూచిస్తున్నారు.
గ్రూప్ పేపర్లు తగ్గించాలనుకుంటే అందులో అర్థమెటిక్ పెట్టకూడదని, గ్రూప్ గ్రూప్ ఇంటర్వ్యూలు పెట్టొదని డిమాండ్ చేస్తున్నారు. రాబోయే ౩ నెలలు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో మేలో టీజీపీఎస్సీ జారీ చేసే నోటిఫికేషన్లలో ముందుగా గ్రూప్ 1, 2, 3 నోటిఫి కేషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రూప్స్ సిలబస్, మార్కు లు, మార్పులు చేర్పులు ఉంటే ముం దుగానే ప్రకటించాలని కోరుతున్నారు.
సిలబస్ మారితే ఇబ్బందే..
ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఒక ఏండ్లు పడుతుంది. సిలబస్‌పై పూర్తి అవగాహన తెచ్చుకుని ఏండ్లు చదివినా రెండు మూడు మార్కుల తేడాతో ఉద్యోగాలను దక్కించుకోలేకపోతారు.
ఒకవేళ సిలబస్, పరీక్ష విధానంలో మార్పులు చేస్తే.. అప్పటి వరకు చదివి న సిలబస్‌ను పక్కన పెట్టి కొత్త సిలబస్‌కు మళ్లీ సన్నద్ధం కావాల్సి ఉం టుంది. ఇది ఉద్యోగార్థులకు సమస్యగా మారనుంది. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల అం శంలో సంస్కరణలు, పరీక్షల విధానం, సిలబస్‌లో ఎలాంటి మార్పు లు చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు.