29-04-2025 12:17:55 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : లేఔట్‌ల స్వరూపాన్ని మా ర్చొద్దని హైడ్రా కమిషనర్ ఏవి.రంగనాథ్ సూచించారు. ప్రజావసరాలకు ఉద్దేశించిన పార్కులు, రహదారులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించారు.
63ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదులపై దృష్టి సారించాలని ఆయన సూచిం చారు. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలపై ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో గూగుల్‌మ్యాప్స్, శాటిలైట్ ఇమేజీలలో గతం లో ఎలా ఉండేవి, ఇప్పుడెలా ఉన్నాయి అనే అంశాన్ని కమిషనర్ పరిశీలించారు. ఆ నిర్మాణాలకు అనుమతులున్నా యా, లేవా అనే అంశాన్ని పరిశీలించిన వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
హైడ్రాకు వచ్చిన పలు ఫిర్యాదులు..
గచ్చిబౌళిలోని సర్వే నంబర్ 124, 125లో 20ఎకరాల పరిధిలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ హౌజింగ్ సొసైటీ లిమిటెడ్ లేఔట్‌లో 162ప్లాట్లు ఉండగావాటి రహదారు లు, పార్కులు, హద్దులనే చెరిపేసి, షెడ్లు, నిర్మాణాలు చేపట్టి సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు వినియోగించుకుంటాటున్నారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పోచారం మున్సిపాలిటీ దివ్యానగర్ లేఔట్‌లో రహదారులను ఆక్రమించి నల్ల మల్లా రెడ్డి షెడ్లు, నిర్మాణాలు చేపట్టారని పలువురు ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేశారు.
2వేల ఎకరాలకు పైగా ఉన్న దివ్యానగర్ లేఔట్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. అవసరమైతే తమ భూములను ఇస్తామని హనుమంతరెడ్డి, జైపాల్ రెడ్డి, సహా పలువురు భూయజమానులు కమిషనర్ రంగనాథ్‌కు వినతిప త్రం ఇచ్చారు. కొండాపూర్, మసీదుబండ సీఎం సీ ఎన్‌క్లేవ్‌లో ప్రజల అవసరాలకు ఉద్దేశించిన స్థలాల్లో ఆసిఫ్‌పటేల్ అనే వ్యక్తి ఆక్రమిం చి నిర్మాణాలు చేపట్టారని హైడ్రాకు సాథనికులు ఫిర్యాదు చేశారు.
తౌతానికుంటలో మట్టి నింపి, భగీరథమ్మ చెరువుకు వెళ్లే వరు ద కాలువలు మూసేయడంతో తమ ప్రాం తాలను వర్షంనీరు ముంచెత్తుతోందని గ్రీన్‌గ్రేస్ రెసిడెంట్స్ సొసైటీ ప్రతినిధులు హైడ్రా కు ఫిర్యాదు చేశారు. అన్నోజిగూడ గ్రామం సర్వే నంబర్ 9, 10లోని 10ఎకరాల్లో లేఔట్ పార్కుకు ఎకరం కేటాయించగా ఇప్పుడు ఆ స్థలాన్ని కూడా ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారని స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు.
హైడ్రా కమిషనర్‌ను సన్మానించిన ఇంజాపూర్ వాసులు
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ వాసులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7కాలనీలకు వచ్చే ప్రధాన రహదారి మూత పడడంతో 20ఏండ్లుగా తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే సమస్యను పరిష్కరించారని హర్షం వ్యక్తం చేశారు.
ఈ నెల 19న శ్రీరంగాపురం కాలనీలో 45అడుగుల ప్రధాన రహదారిపై నిర్మించిన ప్రహరీని హైడ్రా సిబ్బంది తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాపిల్ ఎవెన్యూ, శ్రీరంగాపురం కాలనీ, సాయినాథ్‌కాలనీ, సుందరయ్యనగర్ కాలనీ, శ్రీ శ్రీనివాసకాలనీ, ఇందిరమ్మ 1, 2కాలనీల నివాసితులు హైడ్రా కమిషనర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.