calender_icon.png 17 November, 2024 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సచివాలయ సెక్యురిటీని మార్చవద్దు!

27-07-2024 12:05:00 AM

రాష్ట్రంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన పొలీసులుగా పేరొందిన టీజీఎస్‌పీ (తెలంగాణ ప్రత్యేక పోలీస్) సిబ్బంది విధులను ‘రాష్ట్ర నూతన సచివాలయం’ నుండి తప్పిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే, ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచిం చాలి. వీరు ప్రారంభం నుండి సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. మొదట కొంత ఇబ్బంది పడినా క్రమంగా పటిష్ఠమైన భద్రతను ఇస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. సచివాలయంలో టీజీఎస్‌పీలు ప్రతి రోజూ మూడు షిఫ్ట్‌లుగా 400 మంది, ఇతర ఎఆర్, సివిల్ ట్రాఫిక్ సిబ్బందితో కలిసి మొత్తం సుమారు 600 మంది పని చేస్తున్నారు.

ముఖ్యమంత్రి, సీఎంఓ  ఆఫీసర్స్, సీఎస్ ఉండే 6వ ఫ్లోర్‌తోపాటు ఇతర మంత్రుల చాంబర్లవద్ద పూర్తి పర్యవేక్షణ బాధ్యతను వారే తీసుకున్నారు. సెక్రటేరియట్‌లో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల విధులలో ఎటువంటి ఆటంకం కలుగకుండా, నిరంతరం పనులపై వచ్చే సందర్శకులకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు. దీంతోపాటు సెక్రటేరియట్ ప్రాంగణంలో నిర్మితమైన మత సంబంధ కట్టడాల రక్షణ, నిరంతరం ప్రార్థనల కోసం వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటారు.

వీరిపై ఆర్థిక, రాజకీయ పరమైన ఆరోపణలు లేవు. టీజీఎస్పీ (పోలీస్) సిబ్బందిని సచివాలయ విధుల నుండి తప్పిస్తున్నారని వార్తలు రావడంతో వారిలో అయోమయం నెలకొంది. అన్ని విభాగాలో పనిచేసిన, ఆరితేరిన, అనుభవజ్ఞులైన ఈ పోలీసు విభాగం సిబ్బంది సేవలు వాడుకోవాల్సిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

 -శేఖర్ పగిళ్ళ