calender_icon.png 23 September, 2024 | 4:05 AM

ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చొద్దు

23-09-2024 01:41:35 AM

సీపీఐం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) భూసేకరణను ముందు నిర్ణయించిన అలైన్‌మెంట్ ప్రకారమే చేపట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డితో కూడిన ప్రతినిధి బృందం శనివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చింది. భూసేకరణ, సిరిసిల్ల పవర్‌లూంకు విద్యుత్ చార్జీలు, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వంటి అంశాలపైనా వారు సీఎంతో చర్చించారు.

ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్పు వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు, సాధారణ ఉద్యోగులు, రైతులు నష్టపోతున్నారని వివరించా రు. అయితే అలైన్‌మెంట్ మార్పుపై నిర్ణ యం తీసుకున్నామని, వెనక్కివెళ్లడం కష్టమని బాధితులకు పరిహారం పెంచే ప్రయ త్నం చేస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు.  

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలి..

రాష్ర్టంలో అందరు జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇవ్వాలని బీవీ రాఘవులు సీఎంను కోరారు.  ప్రభుత్వం ఒక సొసైటీకి భూమి ఇచ్చిందని వివరించారు. ఆ సొసైటీలో లేని సీనియర్ జర్నలిస్టులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిశీలించాలంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సీఎం కోరారు.