calender_icon.png 23 September, 2024 | 7:00 PM

పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు మార్చొద్దు

23-09-2024 04:08:08 PM

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి

రంగారెడ్డి(విజయక్రాంతి): పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సురవరం సురవరం ప్రతాపరెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని అందుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో  రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. తెలుగు రాష్ట్రం కోసం 58 రోజులు నిరాహారదీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యుడు మా ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీయకుండా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేర్లు యదార్ధంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వివరించడం సరికాదన్నారు. సురవరం సురవరం ప్రతాపరెడ్డి పేరు వేరే ప్రాజెక్టులకు గాని తదితరవాటికి పేరును సూచించాలి. కానీ ఉన్న పేరును మార్చి వేరే పెట్టడం వల్ల వైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వివరిస్తుంది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావది లక్ష్మీనారాయణ గుప్త, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ చైర్మన్ చింతల రవికుమార్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు అర్థం లక్ష్మయ్య గుప్తా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తాడేపల్లి వెంకటేశం గుప్తా, ప్రధాన కార్యదర్శి గందె సురేష్, మాజీ ప్రధాన కార్యదర్శి సరాపు రమేష్ కుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామిని రామనాథం, నీల నాగరాజు, ఎల్కుర్తి నారాయణ, ఎల్కుర్తి జగదీశ్వర్, ఎల్కుర్తి నాగరాజు, తాటి రామచంద్రుడు, ఆగీరు రవికుమార్, ఆగిరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.