calender_icon.png 15 January, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుధన్‌పల్లి భూములను కొనుగోలు చేయొద్దు

12-07-2024 12:21:19 AM

మావో జేఎండబ్ల్యూపీ కార్యదర్శి వెంకటేశ్ లేఖ

జయశంకర్ భూపాలపల్లి (ములుగు), జూలై 11(విజయక్రాంతి): హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సుదన్‌పల్లి గ్రామంలో భూస్వాముల దోపిడీ, అణిచివేతకు వ్యతిరేకంగా పేద ప్రజలు పోరాడి స్వాధీనం చేసు కున్న సాగు భూములను ఎవరూ కొనుగోలు చేయవద్దని, కొనుగోలు చేసిన వారు.. భూములను వెంటనే వదిలిపెట్టాలని మావోయిస్టు జేఎండబ్ల్యూపీ కార్యదర్శి వెంకటేశ్ గురువారం మీడియాకు ఒక లేఖను విడుదల చేశారు. తిక్క దేవేందర్ అనే వ్యక్తి మావోయిస్టుల పేరు చెప్పి భూములు అమ్మించడానికి పెసలు రాంచంద్రారెడ్డితో రూ.లక్షల్లో ఒప్పందం కుదుర్చుకుని ఆ భూములను ప్లాట్లుగా పెట్టి అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. గత 35 ఏళ్లుగా 42మంది ఆ భూములను సాగు చేసుకుని బతుకుతున్నారని.. ఆ భూములను వదులుకోలేక పోరాటం చేస్తే వారిని అరెస్టు చేయ డం, అక్రమ కేసులు పెట్టడం వంటివి చేస్తున్నారన్నారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆక్రమించుకున్న భూములను ఎవరు కొనుగోలు చేసినా వెంటనే వదిలిపెట్టాలని, లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన లేఖలో హెచ్చరించారు.