calender_icon.png 15 October, 2024 | 7:51 AM

దీపావళికి పటాకులు కాల్చొద్దు

15-10-2024 02:07:17 AM

ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: దేశ రాజధానిలో పటాకులపై ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిషేధం విధించింది. నగరంలో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోవడమే దీనికి కారణమని అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో ఇప్పటి కే  ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ 221గా నమోదైంది.

ఈ నేపథ్యంలో రానున్న దీపావళికి పరిస్థితి మరింత చేయిదాటకూడదనే ముందు జాగ్రత్తలో భాగం గా 2025 జనవరి 1 వరకు పటాకుల కాల్చివేతపై ఢిల్లీ పీసీబీ నిషేధం విధించింది. అన్ని రకాల బాణాసంచా.. తయారీ, నిల్వ, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ పోలీసులు కొత్త నిబంధనలను వెంట నే అమల్లోకి తెచ్చేలా కార్యచరణ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసిం ది.