11-03-2025 11:44:01 PM
తెస్తే పరీక్షలు రాయనీయమంటూ జైపూర్ పాఠశాల హెచ్చరిక..
విద్యాశాఖ మంత్రి ఆగ్రహం..
జైపూర్: రాజస్థాన్ జైపూర్‌లో ఉన్న ఓ పాఠశాల వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. హోలీ సందర్భంగా విద్యార్థులు ఎవరూ పాఠశాల ప్రాంగణంలోకి రంగులను తీసుకురావొద్దని, ఎవరైనా తీసుకొస్తే వారిపై పరీక్షలు రాయకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించింది. దీనిపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన మనోభావాలు దెబ్బతినే విధంగా ఆదేశాలు జారీ చేసిన స్కూల్‌పై సీబీఎస్‌సీకి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.