calender_icon.png 29 December, 2024 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసుల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు

28-12-2024 07:13:05 PM

ఎస్పీ డివి శ్రీనివాసరావు...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కేసుల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని ఎస్పీ డివి శ్రీనివాసరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ ప్రభాకర్ రావుతో కలిసి పోలీస్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫోక్సో, గ్రేవ్ కేసులను త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి చేయాలన్నారు. గంజాయి, జూదం, పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా లాంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడానికి సిబ్బంది పనిచేయాలన్నారు. నూతన సంవత్సర వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాలలో సిసిటీవీల ఏర్పాటుకు కృషి చేయాలని ఇందుకు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు కరుణాకర్, రామానుజన్, జిల్లాలోని సిఐ లు, ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.