ఎమ్మెల్యే హరీష్ బాబు
ఎమ్మెల్సీ దండే విఠలతో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): మధ్యవర్తులను నమ్మి లబ్ధిదారులు మోసపోవద్దని ఎమ్మెల్యే హరీష్ బాబు ఎమ్మెల్సీ దండే విట్టల్ అన్నారు. మంగళవారం సిర్పూర్ (టి) మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో 91 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారులను నమ్మి తప్పిదారులు మోసపోవద్దని సూచించారు. ఎవరికీ కూడా డబ్బులు ఇవ్వవద్దని తెలిపారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సత్యనారాయణ, ఎఓ గిరీషన్ తదితరులు పాల్గొన్నారు.