calender_icon.png 8 November, 2024 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-4 పోస్టులను బ్యాక్‌లాగ్ పెట్టొద్దు

04-11-2024 02:26:45 AM

  1. అన్‌విల్లింగ్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి
  2. ప్రభుత్వానికి అభ్యర్థుల విన్నపం

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాం తి): గ్రూప్-4లో బ్యాక్‌లాగ్ లేకుండా అన్‌విల్లింగ్ (ఇతర ఉద్యోగాలు వచ్చిన వారికి ఈ ఉద్యోగం ఇష్టంలేదని) ఎడిట్ ఆప్షన్ ఇచ్చి నియామకాలు చేపట్టాలని గ్రూప్-4 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

అలా చేపట్టడం ద్వారా మిగతావారికి అవకాశం లభిస్తోంద ని, ఈ నిర్ణయంతో దాదాపు 2 వేల మందిపైగా నిరుద్యోగ కుటుంబాల్లో వెలుగులు నింపిన వాళ్లవుతారని ప్రభుత్వాన్ని అభ్యర్థు లు వేడుకుంటున్నారు. తుది ఫలితాలకు ముందు ఈ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడంతో గ్రూప్-4 కంటే పెద్దస్థాయి ఉద్యోగం వచ్చిన వాళ్లు ఆ ఉద్యోగాలకు వెళ్లడం ద్వారా డౌన్‌మెరిట్‌లో ఉన్నవారికి గ్రూప్-4 ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

ఇందుకు అవకాశం కల్పించాలని టీజీపీఎస్సీ, ప్రభుత్వపెద్దలకు కొన్ని రోజులుగా గ్రూప్-4లో 1 : 3 జాబితాలోని అభ్యర్థులు కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రూప్-4 పరీక్షలు జరిగి దాదా పు పద్నాలుగు నెలలవుతుంది. ఈ మధ్యలో ఎన్నో నియామకాలు జరిగాయి. అందులో ముఖ్యంగా మ్యాథ్స్ బ్యాక్ గ్రౌండ్ ఉండే డీఏఓ, పోలీస్ రిక్రూట్‌మెంట్, జేఎల్, ఏఈ లాంటి గ్రూప్-4 కంటే పెద్దస్థాయి ఉద్యోగాలు పొందిన వారు, ఇంకా పొందే వారూ ఉన్నారు.

అన్‌విల్లింగ్ ఎడిట్ ఆప్షన్ ఇస్తే గ్రూప్-4 ఉద్యోగం ఇష్టంలేని వారి స్థానంలో వెనుక వరుసలో ఉన్న అభ్యర్థుల కు ఉద్యోగాలొచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో టీజీపీఎస్సీలో 6(ఏ) రూల్ ఉండే ది. దీంతో రీలింక్విష్‌మెంట్‌కీ అవకాశం ఉం డటంతో బ్యాక్‌లాగ్‌కి అవకాశాలు ఉండేవి కావు. కానీ, టీజీపీఎస్సీ 2022లో ఆ నిబంధన తొలగించడంతో గ్రూప్-4 తుది ఫలి తాలు రాకముందే ఓ రెండు రోజులు వెబ్‌ఆప్షన్, ఎడిట్‌కి అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. 

న్యాయపరమైన విజ్ఞప్తిని పరిశీలించాలి

గ్రూప్--4లో అన్ని చిన్నస్థాయి ఉద్యోగాలు అయినందున గ్రామీణ ప్రాంత అభ్యర్థులే ఎక్కువ లబ్ధి పొందుతారు. అభ్యర్థుల న్యాయపరమైన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలించి, గ్రూప్-4 ఉద్యోగా ల్లో బ్యాక్ లాగ్‌కి తావులేకుండా ఎడిట్ ఆప్షన్ ఇచ్చి భర్తీకి చర్యలు తీసుకోవాలి.

- మఠం శివానంద స్వామి, 

నిరుద్యోగ విద్యార్థి నేత

ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి సన్నద్ధమవుతున్నా

అనేక సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న నాకు గ్రూప్-4లో మార్కులు కటాఫ్‌కి దగ్గరలో ఉన్నాయి. 1:3 లో ఉన్నా. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి కూడా వెళ్లా. ఉద్యోగం వస్తుందో లేదో అనే ఆం దోళన వెంటాడుతుంది. నాట్ విల్లింగ్ అవకాశం కల్పిస్తే నాకు తప్పక ఉద్యోగం వస్తుంది. కష్టాలూ తీరుతాయి. 

- తొరమామిడి శరత్‌చంద్ర, 

గ్రూప్ అభ్యర్థి, నల్గొండ జిల్లా