15-03-2025 12:00:00 AM
రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14 (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేయొద్దని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం వివిధ విద్యార్థుల సంఘాలతో కాచిగూడలో నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు.
ప్రజల ఆస్తులను ప్రభుత్వం అమ్మొద్దని, కొన్నవారి నుంచి తిరిగి భూములను విద్యార్థి సంఘాలతో కలిసి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ వేలం భూముల వేలం పాటలలో ఎవరు పాల్గొనరాదని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కోలా జనార్ధన్, మురళీకృష్ణ యాదవ్, శివ కుమార్ యాదవ్, డి.అభినీష్, నందగోపాల్, ఉదయ్ నేత, రాజు నేత, మణికంఠ, రవి యాదవ్, బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.