హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్(BRS MLA Harish) రావుకు స్వల్ప ఊరట దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిబ్రవరి 12 వరకు హరీశ్ రావును అరెస్టు చేయొదని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ హయంలో హరీశ్ రావు, అప్పటి టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు తన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) చేయించారని సిద్దిపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Panjagutta Police Station)లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పంజాగుట్ట పీఎస్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై ఇప్పటీకే జనవరి 28వ తేదీన విచారణ జరిపిన కోర్టు పీపీ అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఇవాళ విచారించిన న్యాయస్థానం మరోసారి హరీశ్ రావు అరెస్టును నిషేదిస్తూ తన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 12కి వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు హరీశ్ రావుపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.