దేశ చరిత్రలో ఇది చరిత్రాత్మకం
బ్యాంకర్లు కూడా పండుగ చేస్కోండి
పాత రుణం మాఫీ కాగానే కొత్త రుణాలివ్వండి
బ్యాంకర్లతో సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ నిధులను రైతు రుణాలకే వినియోగించాలని, ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లో జమ చేయవద్దని బ్యాంకర్లకు డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రైతు రుణమాఫీకి సంబంధించి మొత్తం రూ.౩౧ వేల కోట్ల నిధులను ఆగస్టు నెల దాటకముందే విడుదల చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ ఏ రాష్ట్రంలోనూ చేయలేదని పేర్కొన్నారు.
రైతు రుణమాఫీపై గురువారం సచివాలయంలో బ్యాంకర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. మొదటి విడుతలో ౧౧ లక్షల మంది రైతులకు రూ.లక్ష లోపు రుణాలకు రూ.6 వేల కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. ఈ నెలలోనే రెండో దఫాలో రూ.౧.౫ లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత రూ.2 లక్షల వరకు నిధులను విడుదల చేస్తామని వెల్లడించారు. రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి మిగిలిన మొత్తా న్ని రికవరీ చేసుకొని, ప్రభుత్వం మంజూరు చేసే రూ.౨ లక్షల కలుపుకొని మొత్తంగా ఏ రైతు కూడా బకాయి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 40 లక్షల బ్యాంకు ఖాతాల ద్వారా రూ.31 వేల కోట్లను జమ చేస్తున్నట్లు తెలిపారు.
భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రికవరీ కాలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహమని తెలిపారు. రైతులు పండుగ చేసుకుంటున్నట్లుగానే బ్యాంక ర్లు కూడా పండుగ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో 16.5 శాతం వ్యవసాయం రంగం నుంచే వస్తుందని, రాష్ట్రంలో 45 శాతంకంటే ఎక్కువ ప్రజలు వ్యవసాయంపై ఆధారప డ్డారని తెలిపారు. రైతు రుణమాఫీ కింద వచ్చిన నిధులను బ్యాంకర్లు జమ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కోరారు. లోన్లు ఇచ్చే విషయంలో ఎక్కడా అశ్రద్ధ చూపొద్దని, లీడ్ బ్యాంక్ పెద్దన్న పాత్ర పోషించాలని సూచించారు.
దేశ చరిత్రలోనే గర్వించదగ్గ రోజు: మంత్రి తుమ్మల
ఒకే నెలలో రూ.30 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయటం దేశ చరిత్రలోనే గర్వించదగ్గ రోజు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా రుణమాఫీ కింద ఇచ్చింది రూ.70 వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. అలాంటి ఇప్పుడు ఒక్క రాష్ట్రంలోనే రూ.30 వేల కోట్లు ఇవ్వటం గొప్ప రికార్డు అని చెప్పారు. రుణమాఫీ విషయంలో బ్యాంకు బ్రాంచీల వద్ద తొక్కిసలాట జరకుండా చూడాలని మంత్రి సూచించారు. గత ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీని నాలుగుసార్లు విడుదల చేసిందని, ఆ నిధులు వడ్డీకే సరిపోయాయని విమర్శించారు. రెండోసారి రుణ మాఫీ కింద రూ.20 వేల కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, రూ.11 వేల కోట్ల మాత్రమే విడుదల చేశారని తెలిపారు.