calender_icon.png 22 November, 2024 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల ఆవరణలో నీరు నిల్వ ఉండొద్దు

22-11-2024 01:25:40 AM

కలెక్టర్ అనుదీప్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం బహద్దూర్‌పూరలోని దారుల్ షిఫా ప్రభుత్వ ఉన్నత ఉర్దూ మీడియం, ప్రభుత్వ బాలుర అంధుల ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఉర్దూ మీడియం స్కూల్‌లో డ్రైనేజీ నీటి ద్వారా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిం చారు

. డీఈవో, డిప్యూటీ ఈవో, జీహెఎంసీ డిప్యూటీ కమిషనర్, ఈఈ ఐడీసీ, హెఎండబ్ల్యూఎస్, తహసీల్దార్, పాఠశాల హెడ్మాస్టర్‌లు పాఠశాలను తనిఖీ చేసి, స్కూల్‌లో చేపట్టాల్సిన పనులకు శుక్రవారం సాయంత్రంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

పాఠశాల ఆవరణలో వర్షపు నీరు,  డ్రైనేజ్ నీరు నిల్వ ఉండకుండా వారం రోజుల్లోగా పనులు పూర్తి చేయాల న్నారు. కార్యక్రమంలో డీఈవో ఆర్ రోహిణి, హెఎమ్‌డబ్ల్యూఎస్ మేనేజర్ సయ్యద్ అబ్దుల్ జాకీ, హెడ్ మాస్టర్ మహమ్మద్ మసూద్దీన్ అహ్మద్, తహసీల్దార్ చంద్రశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.