calender_icon.png 14 October, 2024 | 5:54 AM

సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతించొద్దు

14-10-2024 01:27:41 AM

ఎమ్మెల్యే, ఎంపీకి అఖిలపక్ష నాయకుల వినతి 

నల్లగొండ, అక్టోబర్ 13 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతించొద్దని కోరుతూ స్థానిక అఖిలపక్ష నాయకులు ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

రెండేళ్ల క్రితం లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తామని రైతులను నమ్మించి రామన్నపేట శివారుల్లో 350 ఎకరాలు కొనుగోలు చేసి ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామనడం సరికాదన్నారు. లాజిస్టిక్ పార్క్ వస్తే స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతో రైతులు భూములు ఇచ్చారని తెలిపారు.

సిమెంట్  పరిశ్రమ ఏర్పాటు చేస్తే వాతావరణ కలుషితమై ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని ఎమ్మెల్యే, ఎంపీలను కోరారు. ఇదే అంశంపై ఈ నెల 22న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుందని తెలిసింది.