calender_icon.png 10 January, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇతర రాష్ట్రాల క్యాబ్‌లను అనుమతించొద్దు

04-08-2024 02:25:59 AM

‘నకిలీ నంబర్ ప్లేట్ల’ను ఉపేక్షించొద్దు..

ఎయిర్‌పోర్టులో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన

రాజేంద్రనగర్, ఆగస్టు 3: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన క్యాబ్‌లను ఎయిర్‌పోర్ట్ అధికారులు అనుమతించొద్దని స్థానిక క్యాబ్ డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్ట్ వద్ద శనివారం వారు వేర్వేరు నంబర్ ప్లేట్లతో క్యాబ్ నడుపుతున్న ముగ్గురు డ్రైవర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు ధర్నా చేశారు. ఎయిర్‌పోర్ట్ అధికారులు తమ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల క్యాబ్‌లు ఏడు రోజులకు మించి ఉండొద్దన్నారు. నకిలీ నంబర్ ప్లేట్లు వినియోగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు పక్కా అమలయ్యేలా చూడాలన్నారు.