calender_icon.png 2 November, 2024 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణకు ఒప్పుకోం

04-08-2024 02:53:16 AM

ఎన్డీయే మిత్రపక్షాలు ఎల్‌జేపీ, ఆర్‌పీఐ

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న లోక్‌జనశక్తి (రాంవిలాస్) పార్టీ (ఎల్‌జేపీ), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) ప్రకటించాయి. ఎస్సీ, ఎస్టీల్లోని అన్ని కులాలకు రిజర్వేషన్లు అందేందుకు ఉప వర్గాలుగా విభజించాలని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై తాము అప్పీల్ చేస్తామని ఎల్‌జేపీ అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ శనివారం ప్రకటించారు. ఎస్సీల వర్గీకరణకు ప్రధాన కారణం అంటరాని తనమని, సుప్రీంకోర్టు తీర్పులో ఆ అంశాన్ని పట్టించుకోలేదని అన్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును పునఃపరిశీలించాలని కోరుతామని మరో కేంద్రమంత్రి, ఆర్‌పీఐ అధ్యక్షుడు రామ్‌దాస్ అథవాలే ప్రకటించారు.