calender_icon.png 22 September, 2024 | 2:54 AM

మా వాటాలేని మహిళా బిల్లును అంగీకరించం

22-09-2024 01:15:36 AM

  1. బీసీ సబ్ కోటా కోసం దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం
  2. ప్రధాని బీసీ అయినా న్యాయం మాత్రం జరగడం లేదు
  3. బీసీ మహిళా సంఘాల రౌండ్ టేబుల్ మీటింగ్‌లో వక్తల డిమాండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): బీసీ సామాజికవర్గానికి చెందిన నరేంద్రమోదీ దేశానికి ప్రధానిగా ఉన్నప్పటికీ బీసీలకు మాత్రం న్యాయం జరగడం లేదని, మహిళా బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించి.. బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకుండా తీవ్ర అన్యాయం చేశారని అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం లేని బిల్లుతో తమకు ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోటా భవిష్యత్ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ మీటింగ్‌లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్‌రావు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ టీ చిరంజీవులు, డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ పాల్గొని ప్రసంగించారు. బండ ప్రకాశ్ మాట్లాడుతూ.. మహిళా బిల్లును దేశంలోని అనేక రాజకీయ పార్టీలు, బీసీ సామాజికవర్గానికి చెందిన ఎంపీలు వ్యతిరేకించినా కేంద్రప్రభుత్వం బలవంతంగా ఈ బిల్లును ఆమోదిం చిందని, మెజార్టీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం లేని బిల్లు ఎవరి ప్రయోజనం కోసమని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ  మెడలువంచి బీసీ మహిళలకు సబ్ కోటా దక్కేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. 78 ఏండ్లుగా చట్టసభలు అగ్రవర్ణాలకు చుట్ట సభలుగా మారాయని, దేశ జనాభాలో 60 శాతం పైగా ఉన్న బీసీలకు మాత్రం 18 శాత మే రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుందన్నా రు. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా బీసీ మ హిళలకు ఒరిగేదేమీ లేదన్నారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న 26 రాజకీయ పార్టీ లు మహిళా బిల్లును వ్యతిరేకించకపోవడం  దారుణమన్నారు.

దసరా తర్వాత రాష్ట్రంలో వెయ్యి మంది మహిళా ప్రజాప్రతినిధులతో రాజకీయ ప్లీనరీ నిర్వహిస్తామని స్పష్టం చేశా రు. డిసెంబర్‌లో వేలాది మం దితో మహిళా గర్జన సభ,  ఫిబ్రవరిలో లక్షమంది మహిళలతో పార్లమెంట్‌ను ముట్టడి స్తామన్నారు. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి బీసీ మహిళలకు జనాభా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ కుల సంఘాల ప్రతినిధులు సంధ్య, రాణి, తారకేశ్వరి, సమత, శ్యా మల, రాణి తదితరులు పాల్గొన్నారు.