మూడు రోజులుగా దుకాణం యజమాని దీక్ష
బెల్లంపల్లి (విజయక్రాంతి): తాను కిరాయికి ఇచ్చిన దుకాణం వ్యాపారి నుండి తనకు న్యాయం చేయాలని కోరుతూ బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డు ప్రాంతానికి చెందిన బైంసా బాలాజీ అనే వ్యక్తి మూడు రోజులుగా దీక్ష చేపట్టారు. తన దుకాణం షెటర్ ను బెల్లంపల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి కిరాయికి ఇచ్చానని తెలిపారు. తన అవసరం కోసం దుకాణం ఖాళీ చేయాలని కోరడంతో ఖాళీ చేయకుండా, తనకు రూ.20 లక్షలు ఇచ్చాడని పోలీసులకు అబద్ధపు ఫిర్యాదు చేసి ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన చెందారు. తన పరిస్థితిని గుర్తించి పోలీసుల తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. తనకు న్యాయం జరిగే వరకు తన దుకాణం ఎదుట దీక్ష కొనసాగిస్తానని భైంసా బాలాజీ చెబుతున్నారు.