calender_icon.png 1 April, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాజ్‌పూర్ రైతులకు న్యాయం చేయండి

30-03-2025 12:00:00 AM

సీపీఎం రంగారెడ్జి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య

జిల్లా కలెక్టర్ సీ.నారాయణరెడ్డికి మెమోరాండం అందజేత

అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 29: అనాజ్‌పూర్ రైతులకు న్యాయం చేయాలని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో  సి. నారాయణరెడ్డిని కలిసి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా పగడాల యాదయ్య మాట్లాడుతూ... గత ప్రభుత్వం హయాంలో అనాజ్‌పూర్ సర్వే నెం. 274 , 275, 276, 277, 278, 281లలో 1991 సంవత్సరంలో 125 మందికి అప్పటి సర్కార్ పట్టా పాస్‌బుక్కులు ఇచ్చిందన్నా.

తెలంగాణ వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో నుంచి తొలగించి, పాస్‌బుక్కులు కూడా ఇవ్వలేదన్నారు. దీని వలన రైతులకు రైతుబీమా, రైతు బంధు, లేకుండపోయింద న్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్నా... అధికారులలో చలనం లేదన్నారు. పాసుబుక్కులు ఇచ్చి.. రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డిని కోరినట్లు తెలిపారు. 

ఏర్పుల నర్సింహా మాట్లా డుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించిన రైతులకు పట్టాపాస్‌బుక్కలు ఇప్పించే విధంగా చొరవ తీసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో బిక్షపతి, ముత్యాలు, వెంకటేష్, మహేష్, సత్తయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.