calender_icon.png 19 March, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు న్యాయం చేయండి

05-03-2025 05:40:52 PM

బిఆర్ఎస్ నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ మానే రామకృష్ణ...

తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం..

చర్ల (విజయక్రాంతి): మండలంలోని రైతులు నష్టాల ఊబిలో కూరుకు పోతున్న మిర్చి రైతులకు కనీస మద్దతు ధర రూ.30 వేలు, వరి ధాన్యానికి క్వింటాల్ కు రూ 500 బోనస్ ప్రకటించి రైతులను ఆదుకోవాలని బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మానే రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం చర్ల బిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో రైతుల సమస్యపై తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ, చర్ల బిఆర్ఎస్ మండల కన్వీనర్ దొడ్డి తాతారావులు మాట్లాడుతూ... మండలంలో మిర్చి వ్యవసాయం ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారని, మిర్చి ధర ఒక్కసారిగా తగ్గిపోవడం, సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో మిర్చి రైతులు అప్పుల పాలై దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి మిర్చి ధర క్వింటాకు రూ 30 వేలు మద్దతు ధర ప్రకటించి, వరి ధాన్యానికి కింటాకు రూ 500 బోనస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అనంతరం బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమం పార్టీ మండల కో కన్వీనర్ అయినవోలు పవన్ మాజీ మండల అధ్యక్షులు సోయం రాజారావు పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ నాతాని రాము పంజా రాజు కాకి అనిల్ కోరం నాగేంద్ర తడికల బుల్లేబ్బాయి కారం కన్నారావు ఎస్సీ సెల్ అధ్యక్షులు కోంభతిని రాంబాబు బీసీ సెల్ అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు ఎస్టీ సెల్ అధ్యక్షులు తుర్రం రవికుమార్ మహిళా అధ్యక్షురాలు త్రివేణి మహిళా ఉపాధ్యక్షురాలు కుప్పల సౌజన్య వీర జయమ్మ తోటమల్ల సుజాత వేములవాడ కృష్ణార్జున రావు కుంజ చంటి కుప్పాల నిరంజన్ దుబ్బ సమ్మయ్య కొంగోరి సోమరాజు తడికల చంద్రశేఖర్ సిద్ధి సంతోష్ సిద్ది కిరణ్ గాదంశెట్టి కిషోర్ సృజన కుకడపు సాయి, రైతులు సంఖ్యలో పాల్గొన్నారు.