* న్యాయమూర్తులకు జీతాలు ఉండవా?
* రాష్ట్రప్రభుత్వాల తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, జనవరి 8: ‘ఉచితాలకు డబ్బులుంటాయి కానీ.. న్యాయమూర్తులకు జీతాలు ఉండవా?’ అంటూ సుప్రీం కోర్టు సోమవారం రాష్ట్రప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. త్వరలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
న్యాయమూర్తుల వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాల సాధనకు అఖిల భారత న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిసన్‌పై బుధవారం వీఆర్ గవాయ్, ఏజీ మసీహ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
‘న్యాయమూర్తులు, న్యాయశాఖ అధికారులు, సిబ్బంది వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వాలు ఆర్థిక పరిమితులు విధిస్తున్నాయి’ అని అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలుపగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
ఇటీవల మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రకటించిన ‘లడ్కీ బహిన్’, ఢిల్లీలో ఆప్ ప్రకటించిన ఉచిత పథకాలను ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఓ పార్టీ ఒక ఉచిత పథకం ప్రకటిస్తే, మరో పార్టీ మరో ఉచిత పథకాన్ని ప్రకటించిందని విరుచుకుపడింది.