calender_icon.png 21 April, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు ఇక పోరాటం తప్పదా?

15-03-2025 12:00:00 AM

కొత్త ప్రభుత్వానికి ఇప్పటి వరకు సమయం ఇచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇక తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు. తమ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కారించాలని, లేని పక్షంలో దశలవారీగా ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. ఇందుకోసమే ఇటీవలె ఉద్యోగ, ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఏసి)గా ఏర్పడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సత్వరమే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యో గ, ఉపాధ్యాయులు తమ పెండింగ్ డి మాండ్ల సాధనకు  పోరాటాలే శరణ్యమని అంటున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు చాలా కాలంగా అనేక సమస్య లతో సతమతమవుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ)గడువు ముగిసి పద్నాలుగు నెలలు గడిచిన ఇప్పటికీ పీఆర్సీ గురించి ఉలుకూ పలుకు లేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రా వాల్సిన బకాయిలు గత ఏడాది మే నుండి పెండింగ్ లో ఉన్నాయి. మెడికల్ రియంబర్స్ మెంట్,జీపీఎఫ్ పార్ట్ ఫైనల్,జీపీఎఫ్ లోన్, మెడికల్ బిల్లులు,ఎర్న్‌డ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్  గత ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి.

రిటైర్మెంట్ తర్వాత పిల్లల పెళ్లిళ్ల కోసం, ఆరోగ్యం క్షీణించి చేసిన అప్పులు తీర్చడం, కొత్త గృహ నిర్మాణాలకోసం, మిగతా అవసరాలకు పనికొస్తాయనుకుంటే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వలసి వస్తోంది. కొంత మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించి పదవీ విరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయుల బిల్లులను చెల్లించాలని కోరితే పదవీ విరమణ చేసిన వారి పెండింగ్ బిల్లులు చెల్లించాలని అనేక మంది కేసుల్లో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేయడం జరిగింది.

 పెండింగ్ బిల్లులపై కాలయాపన

ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలకు తీ పి కబురు ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప పెండింగ్ బిల్లు లకు మోక్షం కలిగించక పోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక సార్లు మంత్రులు ప్రకటనలు చేస్తూ త్వరలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని, పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని చెప్పారు. వీటితో పాటుపెండింగ్‌లో ఉన్న డీఏ లను మంజూరు చేస్తారని ఉద్యోగ, ఉ పాధ్యాయులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల సందర్భం గా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న డి.ఏ మంజూరు చేయడంలో తమకు ఏ రకమైన అభ్యంతరం లేదని చెప్పింది. అయితే ఎన్నికలు ముగిసి 14 నెలలు గడిచినా పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలలో ఒకటి మాత్రమే ఇచ్చారు. మిగతా డీఏలు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు.

317 జీవోలకు పరిష్కారం ఎప్పుడో?

తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చి 317 జీవో ద్వారా స్థానికులను స్థానికేతరులుగా మార్చారు. ఉద్యోగుల సర్దుబాటు పేరుతో సీనియర్, జూనియర్ అని రెండు, మూడు వందల కిలోమీటర్ల దూరం ఉద్యోగ, ఉపాధ్యాయులను కేటాయించడం వల్ల కన్నవారికి, కట్టు కున్న వారికి అందరికీ దూరం కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే 317 జీవో బాధితుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేయగా నే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని  వారంతా ఎంతో నమ్మకంతో ఉన్నా రు. స్పౌజ్ కేసులలో భార్య ఒక దగ్గర, భర్త ఒకచోట, పిల్లలు మరోచోట ఈ విధంగా కుటుంబం మొత్తం అనేక ఇబ్బందులు పడుతున్నారు.మెడికల్ గ్రౌండ్‌లో ఆరో గ్యం క్షీణించిన ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానిక జిల్లాలలో, లోకల్ ఏరియాలో ట్రా న్స్‌ఫర్ చేయాలని కోరుతున్నారు.

 రాష్ట్ర మంత్రులు స్పౌజ్  ఉద్యోగ, ఉ పాధ్యాయులకు త్వరలో తీపి కబురు అని ప్రకటనలు చేయగానే ఉద్యోగ, ఉపాధ్యా య కుటుంబ సభ్యులు అందరూ కలిసి మెలిసి ఉండే రోజులు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. అయితే పద్నాలుగు నెలలు గడిచినా స్పౌజ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కాకపోవడం తో నిరాశ, నిస్పృహలకు గురౌతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు విడివిడిగా కాకుండా కలిసి కట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రిరేవంత్‌రెడ్డిని కలిసి సమస్యలను తెలియజేసి పరి ష్కరించాలనికోరాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడి హైదరాబాద్ లోని ఎల్‌బీస్టేడియంలో 10 వేల మందికి పైగా కొత్త ఉపా ధ్యాయులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇస్తూ మీ సమస్యలు అన్నింటినీ పరిష్కారం చేస్తానని, మీరు అంకిత భావంతో పనిచేయాలని కోరారు. కానీ సీఎం హామీ నోఇ మాటగా మిగిలిందే తతప్ప పరిష్కార దిశగా ముందుకు కదలలేదు.

హెల్త్ కార్డుల సంగతి ఏమిటి ?

తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయల, రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయు లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులను జారీ చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసింది. ఈ ప్రభుత్వమైనా నగదు రహిత ఆరోగ్య కార్డులను జారీ చేయాలని వారు కోరుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ జీతం నుండి ఒక శాతం హెల్త్ కార్డుల కో సం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ ఎందుకు తాత్సారం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న రోగాలకు, విష జ్వరాల కు, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ ఏ చిన్న ఆరోగ్య సమస్యలు వ చ్చినా వేలలో, ప్రయివేటు, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లలో ఫీజుల రూపంలో చెల్లించాల్సి వస్త్తోందని, ఇందుకోసం చేసే అప్పులు అప్పులు తడిసి ము ద్దయితున్నాయని అంటున్నారు.

విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి ఉ ద్యోగి కోరుకుంటాడు. కానీ ప్రభుత్వ నిర్ల క్ష్యం కారణంగా వారు ఆ ప్రశాంతతను కో ల్పోయే పరిస్థితి వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి,  రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోద రం రాజ నరసింహ, మిగతా రాష్ట్ర మం త్రులు, అధికారులు ఉద్యోగి, ఉపాధ్యాయుల, రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వీలైనంత త్వరగా నగదు రహిత ఆరోగ్య కార్డులను జారీ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రతినిధు లు కోరుతున్నారు. కొత్త ప్రభుత్వానికి ఇ ప్పటివరకు సమయం ఇచ్చిన ఉద్యోగ, ఉ పాధ్యాయులు ఇక తమ పెండింగ్ సమస్య ల పరిష్కారం కోసం పోరాటానికి, ఆం దోళనకు సిద్ధమవుతున్నారు.

తమ సమస్యల ను వీలైనంత త్వరగా పరిష్కారం చేయా లని, లేని పక్షంలో దశలవారీగా ఆందోళకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగ, ఉ పాధ్యాయుల సంయుక్త కార్యాచరణ కమి టీ (జెఏసి)గా ఏర్పడి ఉద్యమాలు, పోరాటాలు చేయాలని దశలవారీగా చేస్తూ ఉ ద్యమాలను ఉధృతం చేయడానికి సిద్ధం అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి వి ద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్ర జాపాలన, ఇందిరమ్మ ప్రభుత్వం అంటున్నందుకు వీలయినంత త్వరగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో స మావేశం ఏర్పాటు చేసి పెండింగ్ డీఏలు, బిల్లులు చెల్లించడంతోపాటు 317 జీవో స మస్యలను పరిష్కరిస్తారని, తద్వారా రా ష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో వరు ఆందోళన బాట పట్టకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే వారి చిరకాల డిమాండ్ అయిన  నగదు రహిత హెల్త్ కార్డులను మంజూరు చేస్తారనే ఆశాభావం తో అనేక మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు.

-డా. ఎస్. విజయ భాస్కర్