01-03-2025 12:00:00 AM
రానున్న నాలుగేళ్లలో విద్యానిధికి రూ.10కోట్ల నిధులు
బాగా చదివితేనే బంగారు భవిష్యత్తు
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) : వినియోగదారుల నమ్మకం రెట్టింపు అయ్యేలా వ్యాపారం చేయాలని ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం పల్లెమోనికాలనీ కి చెందిన మాజీ ఎంపిపి పల్లెమోని వెంకన్న నూతనంగా ఏర్పాటు చేసిన విజయ రామ ఐస్ ప్లాంట్ ను, బాలరాజు జూనియర్ కళాశాల విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ, విద్యా నిధికి పోలీస్ శాఖ అందించిన మూడు లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ విజయేందిర కు జిల్లా ఎస్పీ డి జానకి సమక్షంలో అందజేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
విద్యా నిధికి మరో నాలుగు యేండ్ల లో రూ 10 కోట్ల నిధులు వస్తాయని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, డిసిసి కార్యదర్శి టంకర కృష్ణయ్య యాదవ్, నాయకులు శ్రీశైలం యాదవ్, బొట్టు శ్రీను, రఘుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.