09-02-2025 01:32:43 AM
* 90 వేల ఓట్ల మెజార్టీతో విజయం
చెన్నై, ఫిబ్రవరి 8: తమిళనాడులోని ఈరోడ్ తూర్పు అసెంబ్లీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ డీఎంకే తిరుగులేని విజయం సాధించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీసీ చందిరకుమార్ తన సమీప నామ్ తమిళర్ కచ్చి (ఎన్టీకే) అభ్యర్థి ఎంకే సీతాలక్ష్మిపై 90 వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించి విజయబావుటా ఎగురవేశారు.
ఇక్కడి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇలంగోవన్ గతేడాది డిసెంబర్‌లో మృతిచెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.