calender_icon.png 16 March, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందీ డబ్ వ్యాఖ్యలపె భగ్గుమన్న డీఎంకే

16-03-2025 01:37:23 AM

తమిళ సినిమాలపై పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడు ప్రభుత్వాన్ని విమర్శించిన జనసేన అధినేత

పవన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డీఎంకే 

చెన్నై, మార్చి 15: బహుభాషా వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. ఇన్ని రోజులుగా తమిళనాడుకు, కేంద్రానికి మధ్య నడుస్తున్న భాషా వివాదంలోకి ఏపీ డిప్యూ టీ సీఎం పవన్ కల్యాణ్ దూరారు. పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ‘హిందీని బలవంతం గా రుద్దుతున్నారని డీఎంకే నేతలు అంటున్నారు.  హిందీ అవసరం లేకపోతే.. మరి తమిళ సినిమాలను హిందీలోకి ఎందుకు అనువదిస్తున్నారు. బాలీవుడ్ నుంచి డబ్బులైతే కావాలి కానీ హిందీ భాష అక్కర్లేదా’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ‘ఇది చాలా అన్యాయం.

ఓ సర్వే ప్రకారం వీరి సంఖ్య 15 లక్షల మధ్య ఉంటుంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల నుంచి వారికి ఆదాయం సమకూరాలి కానీ హిందీ వద్దా? ఇదెక్కడి అన్యాయం’ అన్నారు. బీహార్ వలసవాదులు, పనివారు కావాలి కానీ హిందీ వద్దా... ఎందుకు ఈ వ్యత్యాసం.. ఈ ఆలోచ నా విధానంలో మార్పు రావాలి అని పేర్కొన్నారు. దీనిపై  డీఎంకే నేతలు భగ్గుమన్నా రు. డీఎంకే నేత ఎలగోవన్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పుట్టక ముందే తమిళ ప్రభు త్వం ద్విభాషా విధానంపై బిల్లు పాస్ చేసిందని గుర్తు చేశారు. ‘మేము 1938 నుంచి హిందీని వ్యతిరేకిస్తూ వస్తున్నాం. ఎంతో మంది నిపుణులు, విద్యావంతుల సలహాలు, సూచనలు తీసుకుని తమిళనాడు ద్విభాషా విధానాన్నే అమలు చేస్తుందని ఎప్పుడో చట్టం చేసింది. ఆ చట్టం వచ్చినపుడు బహు శా పవన్ ఇంకా పుట్టలేదేమో.. తమిళనాడు రాజకీయాల గురించి ఆయనకు అంతగా అవగాహన లేదు కావొచ్చు’ అని అన్నారు. 

అది విద్వేషం కాదే.. 

హిందీని తమమీద బలవంతంగా రుద్దొద్దని చెబితే ఆ భాష మీద ద్వేషం ఉన్నట్లు ఎలా అవుతుందని కన్నడ నటుడు ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. ‘అలా చెబితే హిందీ మీద ద్వేషం ఉన్నట్లు కాదు. అది మాతృభాషను రక్షించుకోవడం. సంస్కృతి, గుర్తింపు కాపాడుకోవడం’ అని వెల్లడించారు.

నేనెప్పుడూ వ్యతిరేకించలేదు: పవన్

తన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పంది స్తూ ‘ఒక వ్యక్తిగా హిందీని నేనెప్పుడూ వ్యతిరేకించలేదు. దాన్ని తప్ప నిసరి చేస్తామంటే నే వ్యతిరేకించా. హిం దీ భాష అమలు గు రించి తప్పుగా చూ పిస్తున్నారు. ఎన్‌ఈపీ  ప్రకారం విద్యార్థులు ఏవైనా మూడు భాషలు ఎంచుకోవచ్చు’ అన్నారు.  డీలిమిటేషన్ పై కూడా కొన్ని పార్టీలు రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు.