calender_icon.png 11 January, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీమార్ట్ ఆదాయం రూ.15,565 కోట్లు

03-01-2025 12:00:00 AM

న్యూఢిల్లీ, జనవరి 2: డీమార్ట్ బ్రాండ్‌నేమ్‌తో రిటైల్ చైన్ నిర్వహిస్తున్న ఎవిన్యూ సూపర్‌మార్ట్ అమ్మకాల ఆదాయం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 17.5 శాతం వృద్ధిచెంది రూ.15,565 కోట్లకు పెరిగింది. 2023 డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ రూ. 13,247 కోట్ల ఆదాయాన్ని నమోదుచేసింది. 2024 డిసెంబర్‌నాటికి దేశంలో 387 డీమార్ట్ స్టోర్లు నడుస్తున్నాయి.