4.8 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ, జనవరి 11: డీమార్ట్ రిటైల్ చైన్‌ను నిర్వహించే ఎవిన్యూ సూపర్‌మార్ట్స్ కన్సాలిడేటెడ్ నికరలాభం 2024 డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసికంలో 4.8 శాతం వృద్ధిచెంది రూ.723.54 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ3లో కంపెనీ రూ.690.41 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ఆర్జించింది.
తాజాగా ముగిసిన త్రైమాసికంలో డీమార్ట్ అమ్మకాల ఆదా యం 17.68 శాతం పెరిగి రూ.13,572 కోట్ల నుంచి రూ. 15,572 కోట్లకు చేరింది. లాభా ల మార్జిన్ మాత్రం 5.1 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గినట్లు శనివారం కంపెనీ ఒక ప్ర కటనలో తెలిపింది. డిసెంబర్ చివరినాటికి కంపెనీ 387 స్టోర్స్‌ను నిర్వహిస్తున్నది.