calender_icon.png 24 October, 2024 | 7:54 AM

డీమార్ట్ నికరలాభం 17 శాతం అప్

14-07-2024 12:14:07 AM

ముంబై, జూలై 13: డీమార్ట్ రిటైల్ చైన్‌ను నిర్వహిస్తున్న ఏవిన్యూ సూపర్‌మార్ట్స్ నికరలాభం 2024 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 17.45 శాతం వృద్ధిచెంది రూ. 773.68 కోట్లకు పెరిగింది. నిరుడు ఇదేకాలం లో కంపెనీ రూ. 658.71 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో డీమార్ట్ అమ్మకాల ఆదాయం 18.57 శాతం వృద్ధితో రూ.11,865 కోట్ల నుంచి రూ. 14,069 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ మధ్యకాలంలో కొత్తగా ఆరు డీమార్ట్ స్టో ర్లు ప్రారంభంకాగా, మొత్తం స్టోర్ల సంఖ్య 371కి చేరింది.